Amaravathi : రెండో విడత భూ సమీకరణ ప్రక్రియకు?

రాజధాని అమరావతి నిర్మాణంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు

Update: 2025-12-11 06:38 GMT

రాజధాని అమరావతి నిర్మాణంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల్లో నేటినుంచి పదిహేడో తేదీ వరకు రెవెన్యూ మేళాలు నిర్వహించనున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో రెవెన్యూ మేళాలు జరపనున్నట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.

నేటి నుంచి రెవెన్యూ మేళాలు...
గ్రామాల్లోని రెవెన్యూ సమస్యలను ఇటీవల మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. గ్రామాల్లోని రెవెన్యూ, ఇనాం భూముల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చేపట్టనున్నారు. మరొక వైపు ప్రభుత్వం ప్రతి రోజూ సీఆర్డీఏ అధికారులకు రాజధాని రైతులు తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం కల్పించింది. సీఆర్డీఏ అధికారులు వినతి పత్రాలను అందివ్వవచ్చు.


Tags:    

Similar News