Amaravathi : అమరావతి అగ్నిప్రమాదాల కేసులో పురోగతి

అమరావతిలో వరుస అగ్నిప్రమాదాల కేసులో పురోగతి కనిపించింది

Update: 2026-03-27 03:07 GMT

అమరావతిలో వరుస అగ్నిప్రమాదాల కేసులో పురోగతి కనిపించింది. అమరావతిలో అగ్ని ప్రమాదానికి కారకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులను తగుల పెట్టిన వ్యక్తి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను కూడా ఏర్పాటు చేసింది.

వాచ్ మెన్ ను అదుపులోకి ...
ఈ నెల 23న పైపులకు నిప్పు పెట్టిన వాచ్ మెన్ రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తుళ్లూరు పీఎస్ కు రాము తరలించారు. రామును నిన్న విచారించిన ఎస్పీ వకుల్ జిందాల్ నేడు కూడా విచారించే అవకాశముంది.అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీన్ రీ-క్రియేట్ చేసిన పోలీసులు, ఈ ప్రమాదానికి ఇంకా ఎవరు కారణమన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News