Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది

Update: 2026-03-27 02:44 GMT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యూలర్ ప్రాతిపాదికన భర్తీ చేయనుంది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 300
ఖాళీల వివరాలు
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 01
సెక్షన్ ఆఫీసర్స్: 05
కంప్యూటర్ ఆపరేటర్:31
అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
లైబ్రేరియన్ గ్రేడ్-II: 01
యూడీ స్టెనో గ్రాఫర్: 07
అసిస్టెంట్: 78
ఎగ్జామినర్: 27
టైపిస్ట్: 44
కాపీయిస్ట్: 34
డేటా ఎంట్రీ ఆపరేటర్: 50
స్టెనో గ్రాఫర్: 01
ఆఫీస్ సబార్డినేట్: 20
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/ డిగ్రీ/ బీటెక్/ లా డిగ్రీ/ ఎమ్మెల్సీ లో ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
వయో పరిమితి: 01.01.2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది...
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రారంభం: 30.03.2026 దరఖాస్తు
చివరి తేదీ:19.04.2026.


Tags:    

Similar News