Amaravathi : అమరావతిలో పనులు ప్రారంభించిన నారాయణ

రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులను ప్రారంభించారు

Update: 2026-03-25 06:26 GMT

రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హెచ్ఓడీ టవర్ -3 కార్నర్ నోడ్ అమర్చే పనులను ప్రత్యేక పూజలు చేసి మంత్రి నారాయణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకేచోట ఉండేలా సెక్రటేరియట్ కు ఐకానిక్ టవర్లను డిజైన్ చేశామని చెప్పారు. ఈ ఐదు టవర్లు నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీ తో నిర్మాణం జరుగుతుందన్న మంత్రి నారాయణ గత ఏడాది వర్షాలు ఎక్కువగా రావడంతో నాలుగు నెలల పాటు పనులకు ఆటంకం కలిగిందని తెలిపారు.

పనులు వేగంగా పూర్తవుతున్నాయని...
ఐకానిక్ భవనాలు,ప్రజాప్రతినిధులు,అధికారుల నివాసాలు,మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి నిర్మాణానికి సీఎం ప్రత్యేక ఫైనాన్స్ మోడల్ ఇచ్చారని, ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టడం లేదని, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని, కొంతమంది అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారన్న మంత్రి నారాయణ ప్రస్తుతం జరిగిన ప్రమాదం పై విచారణ జరుగుతుందని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags:    

Similar News