Andhra Pradesh : ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలివే

రాష్ట్ర మంత్రివర్గం మూడు గంటలపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు

Update: 2026-03-26 11:52 GMT

రాష్ట్ర మంత్రివర్గం మూడు గంటలపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గం తీర్మానం చేశారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 2014లోని సెక్షన్-5ను స‌వ‌రించాల్సిందిగా తీర్మానించారు. కొత్త రాజ‌ధాని స్థానంలో అమ‌రావ‌తి పేరును చేర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టులు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వడ్డెర సంఘాలకు ప్రాధాన్యక్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులపై చర్చించారు. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

పలు సంస్థలకు భూ కేటాయింపులు...
కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేయాలని, జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని తీర్మానించారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందిమార్కాపురం జిల్లా రాయవరంలో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. మృతులకు సంతాపం తెలిపిన కేబినెట్ బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేసారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సిఎం ఆదేశించారు.


Tags:    

Similar News