Chandrababu : అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2026-03-26 14:29 GMT

రాజధాని అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో గుంటూరు-విజయవాడకు సమీపంలో రాజధాని అన్నారని, ఈసారి రాజధాని సీఆర్డీఏ పరిధిలో అమరావతి అని తీర్మానంలో పేర్కొనాలని చంద్రబాబు తెలిపారు. రాజధాని కర్నూలు, ఆ తర్వాత హైదరాబాద్ అక్కడి నుంచి.. మళ్లీ అమరావతికి రావడంపై మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు వివరించారు. 2014లో జగన్ రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య అంటే సమర్థించాడన్నారు.

పీఎంవో చెప్పిన మీదటే...
అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడని గుర్తు చేశారు. నాడు శాసనమండలిలో చైర్మన్ షరీఫ్‍పై దాడి చేసినంత పనిచేశారని, అమరావతి రాజధాని అని తీర్మానం చేసి పంపాలని ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పిందని, 28న అసెంబ్లీలో తీర్మానం చేసి.. అదే రోజు సాయంత్రానికి పంపుతామని చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన జరిగే కేంద్ర కేబినెట్‍ భేటీలో.. తీర్మానం చేస్తామని ప్రధాని కార్యాలయం చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. అందుకే 28న రాజధాని అమరావతిపై తీర్మానం చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


Tags:    

Similar News