Amaravathi : అమరావతి అగ్ని ప్రమాదాలపై సిట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరస అగ్నిప్రమాద ఘటనలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

Update: 2026-03-26 06:49 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరస అగ్నిప్రమాద ఘటనలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇటీవల వరసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంపై అనుమానాలు వ్యక్తం కావడంతో సిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాగాజ మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన పైపులు అగ్ని ప్రమాదంలో దగ్దమయిన సంగతి తెలిసిందే.

గుంటూరు అడిషనల్ ఎస్పీ...
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు గుంటూరు అడిషనల్ ఎస్సీ రవికుమార్ నేతృత్వం వహిస్తారు. నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉన్నారు. తుళ్లూరు సీఐ, డీఎస్పీలు కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను నివేదిక అందించాలని సిట్ ను ఆదేశించింది.


Tags:    

Similar News