అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం
రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది
రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయపూడిలోని హెచ్ఓడీ భవన సముదాయం వద్ద పైపులకు నిప్పు అంటుకుంది. ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద అర్ధరాత్రి చెలరేగిన మంటలను చూసిన వారు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ...
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వచేసిన పైపులకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. 'ప్రమాదమా లేక కుట్రకోణమా..?' అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వెలగపూడి వద్ద ఎల్ అండ్ టి సంస్థకు చెందిన పైపులకు ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు నిప్పుపెట్టడంతో అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై విచారణకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.