విద్రోహచర్య కోణంలో పోలీసుల విచారణ
రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది.
రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది. కీలక ప్రాజెక్టు ప్రాంతాల్లోనే అగ్నిప్రమాదాలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన పైపులు దగ్దం కావడం, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వచేసిన పైపులకు మంటలు అంటుకున్నాయి.
రాజధానిలో వరస ప్రమాదాలపై...
130 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే దగ్ధమయ్యే పైపులు, ఇలా కాలిపోవడంపై విద్రోహ చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, రాజధాని అమరావతి ప్రాంతంలో హైఅలర్ట్ ను పోలీసులు ప్రకటించారు.