Amaravathi : కొత్త ఏడాది తొలిరోజు అమరావతి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాంటమ్ వ్యాలీకి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాంటమ్ వ్యాలీకి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 1న ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా ప్రపంచంలోనే అమరావతి ఖ్యాతి పెరుగుతుందని భావిస్తున్నారు.
క్యాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు...
ఈ క్వాంటమ్ వ్యాలీలో యాభై 0 వేల మంది విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మూడు వేల మంది విద్యార్థులకు అత్యున్నత శిక్షణ అందించనున్నారు. వంద మంది ఉన్నత పరిశోధకుల తయారీ ఈ క్వాంటమ్ వాలీ ద్వారా జరగనుంది. టీచింగ్ ల్యాబ్‍లపై 108 సంస్థల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 197 వర్సిటీల్లో శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ సిద్ధమయినట్లు అధికారులు తెలిపారు.