Pawan Kalyan : పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు... గ్రౌండ్ లెవెల్ లో బాగాలేదు

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-02-09 05:52 GMT

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమపథకాలను అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సరిగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా చోట్ల గ్యాప్ ఉందని తమకు అందుతున్న నివేదికలు చెబుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాజెక్టులతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేపట్టాలని పవన్ కల్యాణ్ కోరారు.

ఎన్ని మంచి పనులు చేసినా...
ప్రభుత్వం ఇక్కడ కూర్చుని ఎంత మంచి పనులు చేసినా, సంక్షేమ పథకాలను అమలు చేసినా క్షేత్ర స్థాయిలో అవి అమలు కాకుంటే ఫలితం ఉండదని తెలిపారు. అర్హులైన అందరికీ పథకాలు అందేలా చూడాలని పవన్ కల్యాణ్ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత కష్టపడుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో పనిచేయకుంటే ప్రయోజనం ఉండదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News