Andhra Pradesh : అమరావతికి మరో గుడ్ న్యూస్..స్పీడ్ పెంచిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. రాజధాని అమరావతి పనులు స్పీడందుకున్నాయి.

Update: 2025-10-20 07:28 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. రాజధాని అమరావతి పనులు స్పీడందుకున్నాయి. అమరావతి రాజధానిని చుట్టూ 190 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్‌ నిర్మాణానికి సంబంధించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ రోడ్డు ప్రధానంగా ఆరు లేన్లుగా ఉండగా, ఇరువైపులా రెండు సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం పదిహేను లేన్లుగా రూపకల్పన చేశారు. జాతీయ రహదారుల సంస్థకు ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్ట్‌ రిపోర్టు ను సిద్ధం చేసి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి ఆమోదం కోసం పంపింది. ఈ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం 24,791 కోట్ల రూపాయలు కాగా, హైదరాబాదు ఓఆర్ఆర్‌ కంటే పొడవుగా ఉండటం విశేషం. అమరావతి ఓఆర్ఆర్‌ పూర్తయిన తర్వాత రాజధాని ప్రాంత రవాణా నెట్‌వర్క్‌ అభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

డీపీఆర్ ఆమోదం పొందిన వెంటనే...
జాతీయ రహదారుల సంస్థ అధికారులు డీపీఆర్‌ పరిశీలన చేసి ఆమోదం తెలపాల్సి ఉంది. ఆమోదం వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ను మొత్తం పన్నెండు దశల్లో అమలు చేయనున్నారు. పూర్తి స్థాయిలో అమలు తర్వాత అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు రవాణా వ్యవస్థను మారుస్తూ, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇవ్వనుందని అధికారులు తెలిపారు. . మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 3,117 కోట్ల రూపాయలు కాగా, ఇందులో భూసేకరణతో పాటు అనుబంధ మౌలిక వసతులు కూడా ఉన్నాయి. డీపీఆర్ ఆమోదం పొందిన వెంటనే భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని...
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం రాజధాని భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని చేయనున్నారు. కేవలం రవాణా వ్యవస్థలో వేగం పెంచడమే ప్రధాన లక్ష్యం కాకుండా, దాని చుట్టూ కూడా నిర్మాణాలు ఊపందుకుంటాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. రాజధానికి సులవుగా చేరుకునేందుకు, ఇతర ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకునేలా ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఉపయోగపడుతుంది. హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ పై ట్రాఫిక్ భారం తగ్గినట్లుగానే రానున్న కాలంలో రాజధానిపై కూడా రవాణా వాహనాలు రాకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ముందుచూపుతోనే దీని నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం 190 కిలోమీటర్ల మేరకు ఈ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది.


Tags:    

Similar News