రాజధాని రైతులకు ఇక సమస్యలుండవ్

రాజధాని ల్యాండ్ పూలింగ్ కు లంక భూములు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

Update: 2025-11-28 02:33 GMT

రాజధాని ల్యాండ్ పూలింగ్ కు లంక భూములు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల ప్లాట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని చెప్పారు. రాజధానికి భూముల ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

లంక భూములిచ్చిన...
లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్ లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని మంత్రి నారాయణ చెప్పారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి నారాయణ తెలిపారు.


Tags:    

Similar News