Amaravathi : రాజధానిలో నారాయణ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.

Update: 2025-11-22 03:11 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాజధానిని 16 వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను పరిశీలించారు.సీడ్ యాక్సిస్ రోడ్డు లో కొండవీటి వాగు,గుంటూరు చానెల్,బకింగ్ హాం కెనాల్స్ పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను మంత్రి నారాయణ పరిశీలించారు.

సీడ్ యాక్సెస్ రోడ్లను...
గతంలో పెనుమాక,ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు కొంత భూమి ఇవ్వకపోవడంతో రోడ్డు పనులు నిలిచి పోయాయి. రోడ్డు పనుల పూర్తికి ఆటంకంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించిన మంత్రి విజయవాడ నుంచి రాజధానికి కరకట్ట మీదుగా వెళ్లే అవసరం లేకుండా త్వరితగతిన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.


Tags:    

Similar News