Amaravathi : రాజధాని రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. సమస్యలు తమ దృష్టికి రాగానే అధికారులకు ఆదేశాలిస్తున్నామని చెప్పారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలతో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమయింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లు రాజధాని రైతులతో సమస్యలపై చర్చించారు.
గ్రామ కంఠాల్లో...
గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని చెబుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములపై అధ్యయనానికి రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రభుత్వం వేసిందని, అందులో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై అసైన్డ్ భూములపై చర్చించామని మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.