ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : అచ్చెన్న

రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు

Update: 2026-03-05 07:22 GMT

ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం,అర‌కులో కాఫీ తోట‌ల న‌ష్టంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి శాసన మండలిలో వివరించారు.

అర్హులైన వారందరికీ...
నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశార‌ని, ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందచేశామ‌ని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


Tags:    

Similar News