Achennaidu : తాను క్షమాపణ చెప్పినా వైసీపీ సభ్యులు అడ్డుకోవడమేంటి?
శ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి విశ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంశం నుంచి తప్పించుకునేందుకే వైసీపీ పాకులాడుతోందని ఆరోపించారు. గతంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం నారా చంద్రబాబు నాయుడుఎన్డీడీపీ రిపోర్ట్‌లో ఉన్న అంశాలనే సభలో చదివారని స్పష్టం చేశారు. దీనిని వక్రీకరించి ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటైందని మండిపడిన ఆయన, ఇండిపెండెంట్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన విమర్శలను ఖండిస్తూ, ప్రజలు ఛీ కొడతారని అసలు అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. బట్ట కాల్చి మీద వేయడం వైసీపీ నేతలకు కొత్త కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మండలిలో వైసీపీ సభ్యుల ప్రసంగానికి అడ్డుపడుతున్నారన్న తోట త్రిమూర్తులు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చానని తెలిపారు.