Chandrababu :అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందే : చంద్రబాబు

రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Update: 2026-03-02 12:44 GMT

రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈరోజు కల్తీ పాలు ఘటన, బాణా సంచా పేలుడు, డయేరియా వంటి సంఘటనలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై శివకాశికి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మన మిత్ర సేవలను...
రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తమైందని అధికారులు వివరించారు. వాట్సప్ 'మన మిత్ర' సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి, నూటికి నూరు శాతం వాట్సప్ సేవల వినియోగం జరగాలన్నారు. అన్ని శాఖల పనితీరు మెరుగు పరుచుకునేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘననలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News