కొనసాగుతున్న చంద్రబాబుతో పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసానికి చేరుకున్న పవన్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చర్చించనున్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలతో పాటు లడ్డూ కల్తీపై తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇరువురు నేతలు చర్చిస్తారని చెబుతున్నారు.
నామినేటెడ్ పోస్టులు...
నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేనకు కేటాయింపులతో పాటు వైసీపీ చేస్తున్న ప్రచారంపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఇద్దరు నేతలు చర్చించనున్నారు.