Andhra Pradesh : నేడు పవన్, చంద్రబాబు కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు

Update: 2026-03-03 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్‌ మీటింగ్‌ లో ఇద్దరూ కలవనున్నారు. కీలక అంశాలపై చర్చించునున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చర్చించనున్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలతో పాటు లడ్డూ కల్తీపై తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇరువురు నేతలు చర్చిస్తారని తెలిసింది.

కీలక అంశాలపై...

దీంతో పాటు రాష్ట్రంలో వరస ఘటనలు చోటు చేసుకోవడంతో కల్తీ పాలు తాగి మరణాలు, డయేరియా, బాణాసంచా పేలుడు వంటి ఘటనల్లో పాలనపరమైన చర్చలు కూడా వీరు చేసే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు టీటీడీ, నామినేటెడ్‌ పోస్టులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఇద్దరు నేతలు చర్చించనున్నారు.


Tags:    

Similar News