Andhra Pradesh :చంద్రబాబును కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు

ఏపీఎన్జీవో సంఘ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు

Update: 2026-03-05 02:53 GMT

ఏపీఎన్జీవో సంఘ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీజీవో సంఘం నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ముఖ్యమంత్రిని కలిశారు. పెండింగ్ డీఏలు, మధ్యంతర భృతి చెల్లింపు, పీఆర్‌సీ కమిటీ నియామకం, వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం వెంటనే చేపట్టాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యలపై కమిటీ నివేదిక అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

సమస్యలను పరిష్కరించాలని...
పెన్షనర్ల సమస్యలు – క్వాంటం పెన్షన్ అన్యాయం సవరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. CPS ఉద్యోగుల అంశాలతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, వివిధ శాఖలలో ఖాళీల భర్తీపై చర్చించినట్లు ఏపీ ఎన్జీవో సంఘ నేత విద్యాసాగర్ తెలపిారు. గత ప్రభుత్వం హయాంలో కనీసం నిర్దిష్ట వ్యవధిలో జీతాలు కూడా పొందలేకపోయిన ఉద్యోగులు, ప్రస్తుత ప్రభుత్వంలో సమయానికి జీతాలు పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను క్రమ పద్ధతిలో చెల్లిస్తున్నారని కానీ, ఉద్యోగుల బకాయిలకు రోడ్డు మ్యాపు ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి చెల్లింపులు సత్వరమే జరగాలని కోరారు.


Tags:    

Similar News