జనసేన కార్యాలయంలో దాడికి యత్నించిన వ్యక్తి అతడే

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2026-03-02 03:14 GMT

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పనిచేసే భద్రతా సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఐదుగురు సిబ్బందిని వారి మాతృ విభాగానికి తిరిగి పంపారు. శుక్రవారం ఓ వ్యక్తి కార్యాలయంలోకి ప్రవేశించి రెండు కార్లు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కార్యాలయంలో భద్రతా లోపాలు వెలుగు చూశాయి.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన...
దీంతో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లను వారి మాతృ విభాగంలో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఖాజూరుకు చెందిన నారద నీలాద్రిగా గుర్తించి, పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతను పార్టీ కార్యాలయంలోకి ఎందుకు చొరబడ్డాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News