చంద్రబాబు నివాసంలో కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతల భేటీ జరుగుతోంది

Update: 2026-02-05 06:22 GMT

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతల భేటీ జరుగుతోంది. తిరుమల లడ్డూ విషయంలోనే ప్రధానంగా చర్చిస్తున్నారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన పిటీషన్ పైనే చర్చిస్తున్నారు. రాష్ట్రంలో తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే సిట్ నివేదిక సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కమిటీ వేయాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తిరుమల లడ్డూ విషయంలో...
అయితే మూడు పార్టీలు కలసి ప్రజల్లోకి విస్తృతంగా తిరుమల లడ్డూ విషయాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ తో పాటు మంత్రులు సత్యకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, పారసారధిలు కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు పార్టీలు కలసి మీడియా సమావేశం పెట్టే అవకాశముంది.


Tags:    

Similar News