Amaravathi : అమరావతి రైతులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-03-28 07:46 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. క్యాపిటయిల్ గెయిన్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వంపై నమ్మకంతో భూములిచ్చిన రైతులకు ఈ అవకాశాన్ని కల్పించింది.

భూములిచ్చిన రైతులకు...
దీంతో భూములిచ్చిన అమరావతి రైతులకు ఊరట కలిగినట్లయింది. మార్చి 31వ తేదీ 2031 వరకూ ఈ నిబంధన అమలులో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News