Pawan Kalyan : వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి అమరావతి రైతుల వరకూ అందరూ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని భయపడుతున్నారని, ఆ భయం అవసరం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేదని అన్నారు. రాజధాని అమరావతి అంటూ శాసనసభలో తీర్మానం చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. అందరిలోనూ ఇదే భయం తనకు కనిపించిందన్నారు.
కూటమి నేతలు కలసి కట్టుగా..
అయితే ఆ భయం అవసరం లేదని, వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కూటమిలో నేతలందరూ కలసి కట్టుగా అందరూ ఉంటే వైసీపీ అధికారంలోకి రావడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. కూటమిలోని పార్టీల నేతల మధ్య బేదాభిప్రాయాలు ఉండవచ్చని, అయితే అవి సర్దుకుపోయేలా ఉండాలని, నిర్ణయాల విషయంలోనూ అందరం కలసి కట్టుగా తీసుకుంటే ఎటువంటి అభిప్రాయ బేధాలు రావని తెలిపారు. అప్పుడు వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని, పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు.