Chandrababu : అమరావతి కోసం దేశం నిలబడ్డా.. వైసీపీ నిలబడలేదు
దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధానిగా చట్టబద్ధత కల్పించడం హర్షణీయమని అన్నారు. సైద్ధాంతిక విభేదాలున్న కొన్ని పార్టీలు కూడా అమరావతిని బలపర్చాయన్నారు. పార్లమెంటులో అన్ని పార్టీలూ మద్దతిచ్చినప్పటికీ వైసీపీ మాత్రం వాకౌట్ చేసిందన్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించి పన్నెండేళ్లయిందని, అయితే ఇప్పటి వరకూ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని చంద్రబాబు అన్నారు.
వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలు...
వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలను కూడా పట్టడం లేదని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న వైసీపీ బిల్లుకు మద్దతివ్వలేదని తెలిపారు. అమరావతిని హైదరాబాద్ కు మించి నిర్మించాలనుకున్నానని చంద్రబాబు తెలిపారు. తనకుంటే అనుభవంతో తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను పోలవరం కోసంఏపీలో కలుసుకున్నానని తెలిపారు. తెలంగాణ తన బ్రెయిన్ ఛెయిల్డ్ అన్నారు. వైసీపీని ఈ ప్రజలు క్షమించరని అన్నారు. వైసీపీని ఇక అధికారంలోకి తీసుకు వస్తే మరోసారి విధ్వంసం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.