Breaking : రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది

Update: 2026-04-02 10:16 GMT

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన పన్నెండేళ్ల తర్వాత ఈ బిల్లు రావటేమిమిటని కేంద్ర ప్రభుత్వాన్ని రేణుకా చౌదరి ప్రశ్నించారు.విభజన చట్టంలో హామీలను ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. పోలవరం నేటికీ పూర్తి కాలేదని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కు వెళ్లాయని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణకు కూడా అన్యాయం జరిగిందని రేణుకా చౌదరి తెలిపారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీని కూడా ఇవ్వలేదన్నారు. తాను కూడా పెట్టారా అమరావతి.. పిలవరా కమరావతి అని తాను అన్నానని రేణుకా చౌదరి అన్నారు.

రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి...
తెలుగుదేశం పార్టీ తరుపున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రసంగించారు. అమరావతిని 2015లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూపాయి తీసుకోకుండా భూములు రాజధాని కోసం ఇచ్చామని తెలిపారు.అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానులంటూ మూడు ముక్కలను చేసేందుకు ప్రయత్నించిందన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు అమరావతికి రాజధాని లేకుండా పోయిందని చెప్పారు. రాజధాని అమరావతి రైతులు 1600 పోరాటం చేశారన్నారు.మహిళలని చూడకుండా రైతులపై కేసులు నమోదు చేశారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతి రాజధాని అని 2024లో తీర్పు నిచ్చారని తెలిపారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు పైసా తీసుకోకుండా తమ భూములిచ్చారన్నారు. వికసిత్ ఆంధ్ర కోసం అమరావతి రాజధాని అవసరమని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి మధ్యలో ఉన్నందున అమరావతిని రాజధాని చేయడం సముచితమని అన్నారు.
అమరావతిలో అవినీతి అంటూ...
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెద్దయెత్తున అవినీతి జరుగుతుందని అన్నారు. ఈ బిల్లు రూపొందించడంలోనే కొన్ని లోపాలున్నాయని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో చదరపు అడుగు నాలుగు వేలు అయితే అమరావతిలో పన్నెండు వేల రూపాయలు అవుతుందని అన్నారు. ఈ బిల్లులో క్లారిటీ లేదన్నారు. అమరావతిని తమ పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదని, ఇప్పటి వరకూ అమరావతిని అభివృద్ధి చేయలేదని అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News