Andhra Pradesh : నేడు కూటమి నేతల కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.
తిరుమల లడ్డూ కల్తీ పై..
ప్రధానంగా తిరుమల లడ్డూ విషయంలో ప్రజల్లోకి మూడు పార్టీలు కలసి ప్రచారం చేపట్టడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కూటమి పార్టీలు కలసి ఉన్నాయన్న భావన ప్రజల్లో కలిగించాలని, అలాగే తిరుమల లడ్డూ విషయంలో జరిగిన విషయాలను ప్రజలకు వివరించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలలో మూడు సభలు పెట్టడమా? లేక జిల్లాల పర్యటన చేయడమా? అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై నేడు చర్చకు వచ్చే అవకాశముంది. దీంతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ముగ్గురు నేతలు చర్చించనున్నారు.