Vijayawada : నేడు గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ

దసరా నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ నేడు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Update: 2025-09-23 02:40 GMT

దసరా నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ నేడు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇంద్రకీలాద్రికి ఈరోజు తెల్లవారు జాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. గాయత్రి దేవి అంటే అన్ని మంత్రాలకు మూలశక్తిగా భావిస్తారు. గాయత్రీదేవి ఉపాసనతతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయని విశ్వసిస్తారు. మొత్తం పదకొండు రోజుల పాటు దుర్గమ్మ నవరాత్రులు జరగనుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

నిన్న దర్శించుకున్న...
దీంతో ఐదు వందల రూపాయల టిక్కెట్ ను రద్దు చేసిన ఆలయ అధికారులు వీవీఐపీ దర్శనాలను కూడా కొన్ని సమయాలకే పరిమితం చేశారు. నిన్న బెజవాడ దుర్గమ్మను దాదాపు 75 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. కొండ మీదకు ప్రయివేటు వాహనాలను అనుమతించడం లేదు.


Tags:    

Similar News