Andhra Pradesh : ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రెండు వారాలు సెలవులు

ఆంధ్రప్రదేశ్ లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు.

Update: 2025-11-07 01:53 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. ఈ నెల 7 వ తేదీ నుంచి రెండు వారాలు యూనివర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఈనెల 7వ తేదీ నుంచి 23 వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని, వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ అంతటా సమగ్రంగా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ప్రకటన లో పేర్కొన్నారు.

ఫుడ్ పాయిజన్ జరగడంతో...
ఈ రోజుల్లో మెస్ తో పాటు వంట గదులు, హాస్టళ్లు మొత్తం పరిశుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు. ఇటీవల ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పుడ్ పాయిజన్ జరిగి విద్యార్ధులు అధిక సంఖ్యలో అస్వస్థతకు గురి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News