Amaravathi : రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయిందిగా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయింది. ఏడు గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమిని సమీకరించాలని ఉత్వర్వులు జారీచేసింది. ఈ రెండో విడత భూ సమీకరణ బాధ్యతను సీఆర్టీఏ కమిషనర్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడుగ్రామాల్లో...
వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి,కర్లపూడి, హరిశ్చంద్రపురం,పెద పరిమి గ్రామాల్లో ఈ భూమినిసేకరించనున్నారు. ఇందులో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉండటం విశేషం. దీంతో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమయినట్లు అధికారికంగా వెల్లడించినట్లయింది. ఈరోజు నుంచి రైతులతో మాట్లాడి సీఆర్డీఏ అధికారులు భూమిని సమీకరించనున్నారు.