Amaravathi : అమరావతిలో ఐబీఎం క్వాంటం వాలీ కోసం ఉత్తర్వులు
అమరావతిలో ఐబీఎం క్వాంటం వాలీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
అమరావతిలో ఐబీఎం క్వాంటం వాలీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీని స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటుచేశారు. ఐబీఎం కంపెనీ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఐబీఎం ప్రతి సంవత్సరం 365 గంటల ఉచిత క్వాంటం కంప్యూటింగ్ టైమ్ ను ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లు & ప్రభుత్వ సంస్థలకు అందిస్తుంది.
అవసరమైన స్థలాన్ని...
క్వాంటం వాలీ ఏర్పాటుకు అవసరమైన రెండు వేల చదరపు అడుగుల సౌకర్యవంతమైన స్థలం, విద్యుత్, సెక్యూర్ నెట్వర్క్ ను ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం రెంటల్ ఛార్జీలు నిబంధనల ప్రకారం ముప్పయి రూపాయలు చదరపు అడుగుగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.