మంత్రివర్గంలో ఆమోదం పొందిన వెంటనే...
ఈ నెల 21 వ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పనులకు ఆమోదం పొంది వెంటనే టెండర్లను పిలవడం జరుగుతుందని అధికారులు తెలిపారు.రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ది పనులను విస్తృత స్థాయిలో చేపట్టడం జరిగిందని, ఆయా పనులను ఏడిసి, సీఆర్డీఏల ఆద్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే మరికొన్ని నూతన ప్రాజక్టులను గ్రీన్ ఫీల్డు ఎయిపోర్టు, ఎస్.టి.ఆర్. విగ్రహం, స్మార్టు ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్సు సిటీ, రివర్ ప్రెంట్, రోప్ వే, ఐ.ఆర్.ఆర్. తదితర పనుల నిర్వహణకు ప్రత్యేక ఎస్.పి.వి.ని ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని కూడా కేబినెట్ లో పెట్టి ఆమోదం పొందనున్ునారు.
మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్...
మంగళగిరిలో 78.01 ఎకరాల్లో గోల్డు క్లష్టర్ ఏర్పాటు చేసి ఆ క్లష్టర్ లో దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టు బడులు పెట్టే విధంగా జెమ్స్ అండ్ జ్యూవలరీస్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అందుకు ల్యాండ్ పూలింగ్ విదానంపై అస్సైనీ భూములను సేకరించేందుకు సీఆర్డీఏకు అనుమతి ని ఇచ్చారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా ఇరవై వేల మందికి మరియు పరోక్షంగా ఎన్నో వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశలు కలుగనుంది. ల్యాండ్ పూలింగ్ లో ఎస్సైనీ, పట్టా భూములను కూడా సేకరించనున్నారు. అయితే ఆయా భూములకు జారీ చేసే సర్టిఫికేట్లలో ఎస్సైనీ భూమి అని స్పష్టంగా మెన్షన్ చేయవద్దని భూదాతలు చేస్తున్న విజ్ఞప్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఎస్సైనీ అనే పదాన్ని తొలిగించాలని ఆదేశించారని అధికారులు తెలిపారు.
రాజధాని ప్రాంతంలో...
అమరావతి రాజధాని ప్రాంతంలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నీటిని బయటకు పంపేందుకు 411.53 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీకి మరియు త్రాగునీటిని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు రూ.376.60 కోట్లతో మరో ప్యాకేజీకి సీఆర్డిఏ సమావేశంలో ఆమోదించారు. మహాలక్ష్మి హోటల్ కన్సార్షన్ కు ఒక ఎకరం , గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎస్.ఆర్.ఎం. కు మరియు విట్ కు మరో వందేసి ఎకరాలు ఇప్పడు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ అంశాన్ని కూడా 21 న జరుగబోయే క్యాబినెట్ లో పెట్టి ఆమోదం పొందనున్నారు. మార్చి 31 కల్లా దాదాపు 4 వేల గృహాలను పూర్తి చేసి అధికారులకు అప్పగించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ మీడియా సమావేశంలో తెలిపారు. రానున్న మూడున్నరేళ్లలో ప్రధాన రహదారులు, వాటి అనుబంధ పనులను మరియు రెండున్నర్రేళ్లలో లేఅవుట్లలోని అన్ని పనులను పూర్త చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.