Amaravathi : నేడు అమరావతిలో 25 బ్యాంకులకు శంకుస్థాపన

అమరావతిలో నేడు ఇరవై ఐదు బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది

Update: 2025-11-28 01:59 GMT

అమరావతిలో నేడు ఇరవై ఐదు బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఇరవై ఐదు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. ఉదయం పది గంటలకుసీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి ఇరవై ఐదు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రధాన కార్యాలయాలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.


Tags:    

Similar News