Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. ఉదయం బెంగళూరులో బయలుదేరి నేడు జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. ఉదయం 11.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి జగన్ బెంగళూరు నుంచి విమానంలో చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు.
రాష్ట్ర పర్యటనలపై...
వైసీపీ అధినేత జగన్ నేడు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రేపు వైసీపీ పార్టీ రీజనల్ కోర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గా పరిశీలకులతో జగన్ సమావేశమవుతారు. ఈ నెల 8వ తేదీన భీమవరం బయలుదేరి వెళతారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహవేడుకలో పాల్గొంటారు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాో జగన్ పర్యటించనున్నారు. అక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిశీలిస్తారు. దీనిపై నేతలో చర్చించే అవకాశముంది.