Amaravathi : చంద్రబాబు సర్కార్ కు రాజధాని రైతుల అల్టిమేటం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సమావేశమయ్యారు

Update: 2025-11-18 04:11 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సమావేశమయ్యారు. భూములు ఇచ్చిన మేము అవమానాలు పాలవుతున్నామని అన్నారు. గ్రామాల్లో సమస్యలు ఏవి పరిష్కారం కావడం లేదని చెప్పారు. ఏమైనా సమస్యలు చెప్పుకుంటే సిఅర్డీ అధికారులు అత్యంత చులకనగా చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాట ఎవరు వినడం లేదని రాజధాని అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెబుతున్నా కిందిస్థాయి అధికారులు అవమానాలు పాలు చేస్తున్నారంటూ వారు తమ ఆవేదనను వెళ్లబుచ్చుతున్నారు.

వెంటనే భూములు ఇచ్చినా...
రాజధాని కోసం చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే తమ భూములను ఇచ్చామని, కానీ భూములు తీసుకున్న తర్వాత అధికారులు తమను చులకనగా చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. భూములు ఇచ్చి వారితో మాటలు అనిపించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరోవైపు రైతుల సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించిన పట్టించుకోవడం లేదని రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి గారితో చర్చించేందుకు ఒక వేదిక కావాలంటూ ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ రాజధాని రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
తమ సమస్యలను పట్టించుకోకుండా...
అధికారులు అమరావతిని హైదరాబాద్ కంటే ఎక్కువ చేస్తాం అని చెబుతున్నా రైతుల వైపు మాత్రం కనీసం కన్నెత్తి చూడడం లేదని ఆవేదన చెందుతున్నారు. మూడు పంటల పండే భూముల ఇచ్చి తాము వారిని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మీ సంవత్సర సంపాదన మానెల సంపాదన అంత లేదు అంటూ అధికారులు చులకనగా మాట్లాడుతున్నారన్నారు. భూములు తీసుకునేటప్పుడు మీ సంతకాలు కావాలన్న వారే ఇపుడు ఎవరో తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని తెలిపారు. తాము ఎన్నిసార్లు వెళ్లి అధికారుల వద్దకు మొరపెట్టుకుంటున్న పట్టించుకోవడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం తమపై కేసులు పెట్టినప్పుడు మొత్తం నడిపించిన రైతులు ఇప్పుడు అనామకులుగా మిగిలిపోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. గుంటూరులో జరిగిన జేఏసీ సమావేశంలో రైతులు ఈ మేరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.











Tags:    

Similar News