Andhra Pradesh : ఏపీలో విద్యుత్తు ఉద్యోగుల సమ్మె వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది

Update: 2025-10-15 02:52 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు జేఏసీ నేతలు ప్రకటించారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. విద్యుత్ యాజమాన్యంతో సుమారు 7 గంటల పాటు చర్చలు సాగాయని, మోదీ పర్యటన కారణంగా వాయిదావేసుకోవాలన్న యాజమాన్యం కోరిందని జేఏసీ నేతలు తెలిపారు.

తాత్కాలికంగానే...
విద్యుత్ యాజమాన్యం విజ్ఞప్తితో సమ్మె వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకూ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నందున తాము తాత్కాలికంగానే సమ్మెను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, ఈ నెల 17న చర్చల తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు విద్యుత్‌ జేఏసీ నేతలు తెలిపారు.


Tags:    

Similar News