నేడు విద్యుత్తు సిబ్బంది సమ్మె పై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు విద్యుత్తు శాఖ జేఏసీతో యాజమాన్యం చర్చించనుంది
ఆంధ్రప్రదేశ్ లో నేడు విద్యుత్తు శాఖ జేఏసీతో యాజమాన్యం చర్చించనుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొంత కాలంగా విద్యుత్తు సిబ్బంది ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సమ్మెను విద్యుత్తు సిబ్బంది వాయిదా వేసుకున్నారు. ఈరోజు యాజమాన్యంతో చర్చలు జరపనున్నారు.
సమస్యలు పరిష్కరించేంత వరకూ...
తమ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకూ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు సిబ్బంది నేడు జరిగే చర్చలు తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోలేదని, పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యుత్తు సిబ్బంది ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.