Amaravathi : నేడు రాజధాని రైతులతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ కోసం నేడు గ్రామస్థులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ కోసం నేడు గ్రామస్థులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం కానున్నారు. రెండో విడతల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయింది. ఏడు గ్రామాల్లో 16,666 ఎకరాల భూ సమీకరణను ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండో విడత భూ సమీకరణలో...
దీంతో నేడు అమరావతి మండలం యండ్రాయిలో గ్రామస్థులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం కానున్నారు. సమావేశంలో మంత్రి నారాయణ కూడా పాల్గొంటారు. అలాగే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రెండో విడత భూ సమీకరణలో పెదకూరపాడు నియోజకవర్గంలోని నాలుగు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుంది.