Andhra Pradesh : భూ సేకరణపై సీఆర్డీఏ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ సేకరణకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు అజెండాలో ప్రతిపాదన ఉంచారు

Update: 2025-10-03 06:05 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ సేకరణకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు అజెండాలో ప్రతిపాదన ఉంచారు. భూ సమీకరణ కింద కొన్ని ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించడంపై ప్రతిపాదనలను కేబినెట్ భేటీకి పంపారు. ఇప్పటి వరకూ అమరావతి నిర్మాణంలో భూములు కొన్ని గ్రామాల రైతులు ఇవ్వలేదు. రైతులు ముందుకు రాకపోవడంతో భూసేకరణ కింద తీసుకోవాలని నిర్ణయించారు.

భూ సేకరణ చట్టం ద్వారా...
2013 భూ సేకరణ చట్టం ద్వారా భూములు సేకరించాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. కొన్ని భూములకు చెందిన రైతులు ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇవ్వకపోవడంతో సీఆర్డీఏ అధికారుల ప్రతిపాదనల మేరకు భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరో్జు కేబినెట్ లో దీనికి ఆమోదం తెలపనుంది.


Tags:    

Similar News