Andhra Pradesh : అమరావతిలో భూసేకకరణకు నిర్ణయం

అమరావతిలో భూసేకకరణ చేయాలని సీఆర్డీఏ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2025-09-02 12:04 GMT

అమరావతిలో భూసేకకరణ చేయాలని సీఆర్డీఏ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏజీసీ మౌలిక వసతుల కల్పన కు టెండర్లు దక్కించుకున్న సంస్థకు ఎల్.ఓ.ఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ఆద్వర్యం లో ఉన్న ఏడీసీఎల్ తరహాలో కొత్తగా మరో ఎస్.పీ.వీ ఏర్పాటుకు అధారిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ,ఎన్టీఆర్ విగ్రహం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం కొరకు కొత్తగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

సీఆర్డీఏ సమావేశంలో...
అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సీఆర్డీఏ సమావేశం ఆమోదం తెలిపింది. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ శాఖల నుంచి 138 మంది ఉద్యోగులను డిప్యూటీషన్ పై తీసుకునేందుకు ఆమోదం చెప్పింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్దిమంది రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. రైతులను ఇబ్బంది పెట్టకూడదనేది ప్రభుత్వ నిర్ణయమని, ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ కు రైతులు ముందుకొస్తే తీసుకుంటామని, దాదాపు 1800 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ కు రావాలని మరోసారి రైతులను కోరుతున్నానని, భూసేకరణ కంటే భూసమీకరణ అయితేనే రైతులకు లబ్ది జరుగుతుందని, భూములు ఇవ్వకపోవడం తో కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.


Tags:    

Similar News