రాజధాని రైతులకు సీఆర్డీఏ కమిషనర్ హమీ
రాజధాని అమరావతి రైతులకు సీఆర్డీఏ కమిషనర్ హమీ ఇచ్చారు.
రాజధాని అమరావతి రైతులకు సీఆర్డీఏ కమిషనర్ హమీ ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శనివారం రైతుల జెఎసితో సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ కన్నబాబు తెలిపారు. రాజధాని సమగ్ర ప్లాను అమలు, నోటిఫై చేసిన డ్రాఫ్ట్ ప్లాను, మార్గదర్శకాలాను అంశాలను వివరించేందుకు మంగళవారం సాయంత్రం సిఆర్డిఎ కార్యాలయంలో రైతు ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. దీనికి కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవతేజ హాజరయ్యారు.
ప్రతి నెల మూడో శనివారం...
ప్రస్తుతం అమరావతి బ్లూప్లాన్, రోడ్లు, కాలువలు, రిజర్వాయర్లు, రోడ్ల వెంట గ్రీనరీ, నడక, సైకిల ట్రాక్, విద్యుత్ లైన్లు, మంచినీటి పైపులైన్లు వంటివి ఎలా ఉంటాయి. వాటిని ఎలా వినియోగిస్తామనే అంశాలను అధికారులు, కమిషనర్ రైతులకు వివరించారు. అనంతరం రైతులు జెఎసి తరుపున సమర్పించిన 14 డిమాండ్లను లేవనెత్తారు. ప్రతి మూడో శనివారం సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో కమిషన్ వెంటనే స్పందించారు.