Chandrababu : నేడు సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పాల్గొంటారు. అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, ఇటీవల జరిగిన ఒప్పందాలపై సమీక్ష నిర్వహిస్తారు.
రాజధాని భూ సమీకరణపై...
మధ్యాహ్నం 2.45 గంటలకు సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రాజధాని అమరావతి పనుల పురోగతిపైన అధికారులను అడిగి తెలుసుకుంటారు. అలాగే రెండో విడత భూ సమీకరణ విషయంపై కూడా అధికారులు, మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. పనులువేగంగా జరగాలనిఆదేశించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు