Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.35 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఉదయం 11.50 గంటలకు వైద్యారోగ్య శాఖపై సమీక్ష ను చంద్రబాబు నిర్వహించనున్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలల నిర్వహణకు టెండర్లలో స్పందన కనిపించకపోవడంపై ఆరా తీస్తారు. టెండర్ల గడువు మరొకసారి పొడిగించే విషయమై చర్చించనున్నారు.
వైద్య ఆరోగ్య శాఖపై...
మధ్యాహ్నం 12.10 గంటలకు స్వర్ణాంధ్రపై నోడల్ సెక్రటరీలతో సమావేశమవుతారు. దీంతో పాటు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారితోచంద్రబాబు కలవనున్నారు. అలాగే మధ్యాహ్నం మరికొన్ని కీలక అంశాలపై చంద్రబాబు సమీక్షలను నిర్వహించనున్నారు. సాయంత్రంఐదు గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు