Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

Update: 2025-12-29 03:59 GMT

ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు నేడు ఉదయం 10.25 గంటలకు సచివాలయానికి ఉండవల్లిలోని తన నివాసం నుంచి చేరుకుంటారు. అనంతరం ఉదయం పదకొండు గంటలకు జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

ఆర్టీజీఎస్ పై సమీక్ష...
కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ తో పటు పథకాల అమలు గురించి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు


Tags:    

Similar News