Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2026-02-11 03:44 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం 9.45 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు. 9.57 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు.

మంత్రివర్గ సమావేశంలో...
మధ్యాహ్నం 1.35 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. కీలక అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6.10 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు


Tags:    

Similar News