Andhra Pradesh : నేడు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు

Update: 2026-02-11 03:09 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

అసెంబ్లీలో చర్చించాల్సిన ...
ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఎలా ఉభయ సభల్లో చర్చించాలన్న దానిపై సభ్యులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News