Chandrababu : అమరావతిలో క్వాంటం వాలీ ఒక గేమ్ ఛేంజర్
అమరావతిలో క్వాంటం వాలీ ఒక గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
అమరావతిలో క్వాంటం వాలీ ఒక గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్వాంటమ్ వ్యాలీతో కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ అంతా విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. చరిత్ర రాయాలన్నా.. తిరగ రాయాలన్నా యువతకే సాధ్యమన్నారు. యువత సాంకేతిక రంగంలో క్వాంటం వేగంతో దూసుకు పోతుందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్ లో ఇక్కడి నుంచి ప్రొడక్షన్ దేశమంతటికీ సరఫరా అవుతంుదని తెలిపారు.
నాడు హైటెక్ సిటీ...
నాడు హైటెక్ సిటీ హైదరాబాద్ కు ఎలా గేమ్ ఛేంజర్ గా మారిందో... నేడు అమరావతిలోని క్వాంటమ్ సిటీ ఏపీకి గేమ్ ఛేంజర్ గా మారనుందని తెలిపారు. నలభై ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.ఈ ఏడాది చివరి నాటికి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ రావాలని చెప్పానని, ఇందుకోసం టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టి ప్రతినిధులతో మాట్లాడానని చెప్పారు. ఏప్రిల్ 14న మరో రెడు క్వాంటమ్ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తామని, 2030 లోగా రెండున్నర లక్షల మంది క్వాంటమ్ నిపుణులు కావాలని చంద్రబాబు ఆంకాంక్షించారు.