Chandrababu : రెండు విషయాల్లో తీపికబురు చెప్పిన చంద్రబాబు

అమరావతిని మూడేళ్లలో పూర్తి చేసి ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Update: 2026-02-09 06:01 GMT

అమరావతిని మూడేళ్లలో పూర్తి చేసి ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాజధాని కోసం త్యాగం చేసిన రైతులను కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందని తెలిపారు. అమరావతి పనులు వేగవంతమయ్యాయని, మూడేళ్లలో రాజధాని రూపు రేఖలే మారిపోనున్నాయని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో చంద్రబాబు అన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో...
అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కూడా ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు వేగం అందుకున్నాయని, గత ప్రభుత్వం డయాఫ్రం వాల్ కూలిపోయినా పట్టించుకోలేదని, తాము వచ్చిన తర్వాత దానిని పూర్తి చేసి పనుల్లో వేగం పెంచామని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని తెలిపారు.


Tags:    

Similar News