Amaravathi :నేడు క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఉద్దండరాయుని పాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. క్వాంటమ్ వ్యాలీని నిర్మించాలని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయం మేరకు నేడు పునాది రాయి పడనుంది.
భూమి పూజ అనంతరం...
క్వాంటమ్ వాలీ భవనం డిజైన్ ను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. క్వాంటమ్ వ్యాలీ భవనం నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఒప్పందాలను కూడా చేసుకున్నారు. ఈరోజు భూమి పూజ అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు.